హోలీ సందర్భంగా మార్చి 3వ తేదీన హైదరాబాద్ అంతటా వైన్ షాపులు, బార్లు బంద్ ఉంటాయని సీపీ సజ్జనార్ తెలిపారు. ఎవరైనా దొంగచాటుగా మద్యం అమ్మితే కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు. పండుగను అందరూ ప్రశాంతంగా, ఆనందంగా జరుపుకోవాలని కోరారు.

హోలీ ప్రశాంతంగా జరిగేలా హైదరాబాద్‌లో పోలీసులు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఈరోజు (మార్చి 3) ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు బార్లు, వైన్ షాపులు, క్లబ్బులు, కల్లు కాంపౌండ్లు అన్నీ బంద్ చేయాలని సీపీ సజ్జనార్ ఆదేశించారు. దీంతో నగరంలో ఇప్పటికే చాలా దుకాణాలు మూతపడ్డాయి. ఎవరైనా దొంగచాటుగా మద్యం అమ్మితే మాత్రం కేసులు తప్పవని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు.
అల్లర్లకు దిగితే యాక్షన్ తప్పదు
హోలీ పండుగను అందరూ ప్రశాంతంగా జరుపుకోవాలని సీపీ సజ్జనార్ నగరవాసులను కోరారు. ఎక్కడైనా ఎవరైనా అల్లర్లు చేస్తున్నట్లు కనిపిస్తే.. వెంటనే 100 నంబర్‌కు కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
డీజేలకు పర్మిషన్ లేదు
హోలీ నెపంతో రోడ్లపై వెళ్లేవారిపై రంగులు చల్లితే యాక్షన్ తీసుకుంటామని సీపీ సజ్జనార్ తెలిపారు. ఈరోజు సిటీలో పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుంది కాబట్టి, కార్లు, బైక్‌ల మీద గుంపులుగా రోడ్ల మీదకు రావొద్దని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. సిటీలో డీజేలకు అసలు అనుమతే లేదని, డీజేలు పెట్టి పక్కవారికి ఇబ్బంది కలిగించినా, రూల్స్ బ్రేక్ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఈ గుడిలో మాల వేస్తే మందు అలవాటు మాయం!











Leave a Reply