–మనదేశం న్యూస్ డెస్క్
మత్స్యకారుల ఉపాధి అవకాశాలను మెరుగుపెరిచేందుకు ఐసీఏఆర్ (ICAR)- సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CMFRI) శాస్త్రవేత్తలు ఒక మంచి సరికొత్త సాంకేతికతను అందుబాటులోకి తెచ్చారు. సముద్రంలో చేపల పెంపకం కోసం వీరు ప్రత్యేకంగా 3×3 మీటర్ల హై డెన్సిటీ పాలీ ఎథిలిన్ (HDPE) తేలియాడే తెప్పలను (Floating Rafts) అభివృద్ధి చేశారు.
ఈ ఆధునిక తెప్పలను విశాఖపట్నం లో ఉన్న మత్స్యకారుల లకి అందేజేశారు. సముద్రంలో కేజ్ కల్చర్ (పంజరాల్లో చేపల పెంపకం) పద్ధతి విధానం లో అధిక రాబడి సాధించి, మత్స్యకారుల ఆదాయం మరింత పెంచేందుకు ఈ ఆధునిక తెప్పలు ఎంతగానో సహాయపడతాయని భావిస్తున్నారు. సముద్రపు అలల అంత బానలాగా వచ్చినా తట్టుకునేలా, ఎక్కువ రోజులు మన్నిక వచ్చేలా ఈ 3-బై-3 మీటర్ల తెప్పలను శాస్త్రవేత్తలు ఎంతో కట్టుదిట్టంగా రూపొందించారు.











Leave a Reply