కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి, చంద్రబాబు తర్వాత సీఎం ఎవరంటే లోకేశ్ పేరే వినిపించింది. అయితే సడెన్‌గా వైసీపీ నేతలు పవన్ కల్యాణ్‌కు సీఎం పోస్ట్ ఇవ్వాలని డిమాండ్ చేయడం చూస్తుంటే.. దీని వెనక ఏదో పెద్ద ప్లానే ఉన్నట్లు అనిపిస్తోంది.
కాపుల సెంటిమెంట్ ప్రకారం పవన్నే సీఎం చేయాలి” అంటూ వైసీపీ ఒకపక్క సరికొత్త డిమాండ్ వినిపిస్తోంది. అసలు పవన్ సీఎం పోస్టుతో ప్రతిపక్షంలో ఉన్న వైసీపీకి పనేంటి? సడెన్‌గా ఎందుకీ డిమాండ్? టీడీపీ-జనసేన మధ్య గొడవలు పెట్టడానికే ఈ ప్లాన్ వేశారా? మరి ఫ్యాన్ పార్టీ వ్యూహాన్ని పవన్ ఎలా తిప్పికొడతారు? ఆయన దగ్గరున్న విరుగుడు ఏంటన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.
సీఎం చేయాల్సింది లోకేశ్‌ను కాదు.. పవన్ కల్యాణ్‌ను! కాపుల కోరిక కూడా అదే అంటూ వైసీపీ నేతలు సడెన్‌గా కొత్త రాగం అందుకున్నారు. అదేంటి, వైసీపీ వాళ్లు పవన్ సీఎం కావాలని ఎందుకు డిమాండ్ చేస్తున్నారని మీకు డౌట్ రావొచ్చు. దీని వెనక వాళ్ళకో లెక్క ఉంది. పవన్‌కు అనూహ్యంగా ఎలివేషన్ ఇస్తే, టీడీపీ-జనసేన మధ్య పొగ పెట్టొచ్చన్నది వాళ్ల ఆలోచన. అసలు అకస్మాత్తుగా ఈ సీఎం కుర్చీ మేటర్ ఎందుకు తెరపైకి వచ్చింది? వైసీపీ వేస్తున్న ఈ ప్లాన్లను పవన్ తన రివర్స్ స్ట్రాటజీతో ఎలా తిప్పికొడుతున్నారు?
2029 ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి రావడం వైసీపీకి అంత ఈజీ కాదు. ముఖ్యంగా ఆ మూడు పార్టీలు కూటమిగా కలిసుంటే వాళ్ల టార్గెట్ రీచ్ అవ్వడం చాలా కష్టం. అందుకే కూటమిని విచ్ఛిన్నం చేయడంపైనే ఫ్యాన్ పార్టీ మెయిన్‌గా ఫోకస్ పెట్టింది. ఆ ముగ్గురిని విడదీస్తే చాలు.. ఈజీగా బౌన్స్ బ్యాక్ అవ్వొచ్చని వైసీపీ లెక్కలు వేసుకుంటోందట. అందుకే అవకాశం చిక్కిన ప్రతీసారి.. చంద్రబాబు, పవన్ మధ్య ఏవో క్లాషెస్ ఉన్నాయని జనంలోకి తీసుకెళ్లేలా రకరకాల ప్రచారాలకు తెరలేపుతున్నారని కూటమి లీడర్లు ఫైర్ అవుతున్నారు.
కూటమిలో చిచ్చుపెట్టాలని వైసీపీ చూస్తుంటే.. వాళ్ల ఎత్తుగడలకు పవన్ కూడా గట్టిగానే పైఎత్తులు వేస్తున్నారన్న చర్చ నడుస్తోంది. అనవసర వివాదాలకు దూరంగా ఉంటూ.. నెలకు ఒకటీ రెండు సార్లు చంద్రబాబుతో సమావేశం అవుతూ కూటమి అంతా కలిసే ఉందనే మెసేజ్ ఇస్తున్నారు పవన్. ఇదిలా ఉంటే.. వైసీపీ మళ్లీ పాత పాటను కొత్తగా పాడుతోంది. “చంద్రబాబు తర్వాత పవనే సీఎం.. అది కాపుల కోరిక” అంటూ ఆ పార్టీ నేతలు, వైసీపీ సోషల్ మీడియా రకరకాల పోస్టులతో హడావుడి చేస్తున్నారు.
వైసీపీకి సడెన్‌గా పవన్ మీద ఇంత ప్రేమ పుట్టుకురావడానికి, ఆయనే సీఎం కావాలని కోరుకోవడానికి అసలు కారణం.. కూటమిలో కుంపటి రాజేయడమేనని అంతా అనుకుంటున్నారు. కాపుల పేరు చెబుతూ, పవన్ సీఎం కావాలంటూ వస్తున్న కామెంట్స్ వెనుక.. ప్రధానంగా లోకేశ్, పవన్ మధ్య దూరం పెంచే వ్యూహమే దాగి ఉందని కూటమి లీడర్లు బలంగా నమ్ముతున్నారు.
టీడీపీలో నారా లోకేశ్‌కు సీఎం బాధ్యతలు అప్పగించాలన్న చర్చ కొన్నాళ్లుగా సాగుతున్న సంగతి తెలిసిందే. మీడియాలోనూ దీనిపై రకరకాల కథనాలు వచ్చాయి. అయితే, కూటమిలో ఈ వ్యవహారంపై పెద్దగా రచ్చ జరగకుండా చంద్రబాబు, పవన్ ఇద్దరూ కలిసి అప్పట్లో ఫుల్ స్టాప్ పెట్టగలిగారు. కానీ సీన్ కట్ చేస్తే.. తాజాగా బిహార్‌లో జరిగిన రాజకీయ పరిణామాలు ఏపీలో మళ్లీ కొత్త డిబేట్‌కు తెరలేపాయి. నితీశ్ కుమార్ రాజీనామా చేసి పెద్దల సభకు వెళ్లడం, సీఎం పగ్గాలు బీజేపీకి ఇచ్చి.. తన కుమారుడికి డిప్యూటీ సీఎం పోస్ట్ ఇప్పించుకోబోతున్నారన్న వార్తలతో.. ఈ బిహార్ ఫార్ములా ఏపీలో కూడా రిపీట్ అవుతుందా అన్న ఆసక్తికర చర్చ మొదలైంది.
సీఎం కుర్చీలో పవన్.. డిప్యూటీగా లోకేశ్!
ఎన్డీయే పాలిటిక్స్‌లో ఇప్పుడు మరో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు త్వరలో డిప్యూటీ పీఎంగా ఢిల్లీకి వెళ్తారని, అప్పుడు ఏపీ సీఎం పగ్గాలు లోకేశ్ చేపడతారని ఒక వార్త వినిపిస్తోంది. అయితే, సరిగ్గా ఇదే అదనుగా వైసీపీ నేతలు కొత్త రాగం అందుకున్నారు. చంద్రబాబు కేంద్రానికి వెళ్తే మాత్రం పవన్నే సీఎం చేయాలని, లోకేశ్‌కు డిప్యూటీ సీఎం పోస్ట్ ఇవ్వాలంటూ ఓపెన్‌గా స్టేట్మెంట్లు ఇస్తున్నారు. దీనికి తోడు పవన్ సీఎం పదవిని కాపుల కోరికతో ముడిపెడుతూ వైసీపీ నేతలు చేస్తున్న కామెంట్స్ ఏపీ పాలిటిక్స్‌లో కాక రేపుతున్నాయి.
ఆ డిమాండ్ వెనుక వైసీపీ అసలు ఎజెండా ఇదేనా?
2029 ఎన్నికల్లో గెలుపు తమదేనని వైసీపీ నేతలు ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు. మరోవైపు.. కూటమి ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు వారసుడిగా నారా లోకేశ్ సీఎం అవుతారని ఇన్నాళ్లూ అంతా అనుకున్నారు. కానీ, అనూహ్యంగా పవన్ కల్యాణ్‌కు ఆ పదవి ఇవ్వాలంటూ వైసీపీ నేతలు తెరపైకి తెచ్చిన డిమాండ్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. సొంత పార్టీ జనసేన నేతలు, ఎమ్మెల్యేలు కూడా పవన్‌ను సీఎం చేయాలని ఎప్పుడూ ఇంతలా అడగలేదు. అలాంటిది వైసీపీ నేతలు పవన్ సీఎం కుర్చీపై ఎవరికీ లేని ఆసక్తి చూపిస్తుండటం చూస్తుంటే.. దీని వెనక వైసీపీ పన్నిన ఏదో పెద్ద పొలిటికల్ స్కెచ్ ఉండే ఉంటుందని రాజకీయ వర్గాల్లో గట్టిగా అనుకుంటున్నారు.
కూటమి అంతా ఇలాగే కలిసుంటే భవిష్యత్తులోనూ అధికారంలోకి రావడం కష్టమని వైసీపీ సీనియర్లు ఫిక్స్ అయ్యారట. అందుకే పవన్‌కు కావాలనే ఎలివేషన్ ఇచ్చి.. కూటమిలో చిచ్చుపెట్టాలని స్కెచ్ వేశారని కూటమి లీడర్లు చెబుతున్నారు. కానీ, వైసీపీ వేస్తున్న ఈ ప్లాన్స్ పవన్‌కు ముందే అర్థమయ్యాయి. అందుకే చంద్రబాబు కంటే ముందే కూటమిలో ఎలాంటి చిన్న గ్యాప్ కూడా రాకుండా ఆయన చెక్ పెడుతున్నారు. “కూటమి లాంగ్ లివ్.. ఇంకో 15, 20 ఏళ్లు మేం కలిసే ఉంటాం” అంటూ పదే పదే చెప్పడం, చంద్రబాబుతో వరుసగా సమావేశాలు నిర్వహించడం.. ఇవన్నీ వైసీపీకి చెక్ పెట్టేలా పవన్ అమలు చేస్తున్న పక్కా స్ట్రాటజీ అని పొలిటికల్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న మాట.
వైసీపీ లీడర్లు ఎన్ని ప్లాన్లు వేసినా కూటమిని విడదీయడం వాళ్ల వల్ల కాదంటూ కూటమి నేతలు గట్టిగానే రివర్స్ కౌంటర్లు వేస్తున్నారు. ఇంకోపక్క చంద్రబాబు ఉప ప్రధాని అవుతారని, ఏపీకి లోకేశ్ సీఎం అవుతారన్నది కేవలం గాలి వార్తలేనని తేల్చి చెబుతున్నారు. పవన్ సీఎం కావాలంటూ వైసీపీ నేతలు పదే పదే అంటున్న మాటలు కూడా.. కేవలం ప్రజల్లో, పార్టీ శ్రేణుల్లో లేనిపోని అపోహలు సృష్టించడానికేనని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.











Leave a Reply