వారసత్వంగా వచ్చే వ్యవసాయేతర స్థలాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రభుత్వం మరింత సులభతరం చేస్తూ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. వీటి ప్రకారం.. గ్రామాల్లో ఇలాంటి స్థలాల రిజిస్ట్రేషన్‌కు ఇకపై రెవెన్యూ శాఖ సర్టిఫికెట్ అవసరం లేదు, కేవలం సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తే సరిపోతుంది.
ఆ ఆస్తి తమకు పూర్వీకుల నుంచి వచ్చిందని, అది నిషేధిత జాబితా (22A)లో లేదని, దానికి తామే పూర్తి హక్కుదారులమని అందులో స్పష్టంగా రాయాల్సి ఉంటుంది. అయితే, తప్పుడు సమాచారం ఇస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది.

గతంలో ఇలాంటి ఆస్తుల బదలాయింపు పెద్ద తలనొప్పిగా ఉండేది. వారసత్వంగా వచ్చిన వ్యవసాయేతర భూములకు సంబంధించి యజమానుల దగ్గర ఎలాంటి ఆధారాలు ఉండేవి కావు. దీంతో భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా, రెవెన్యూ శాఖ నుంచి ఓనర్షిప్ సర్టిఫికెట్ తీసుకురావాలని రిజిస్ట్రార్లు పట్టుబట్టేవారు. కానీ, రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరిగి ఆ సర్టిఫికెట్ తెచ్చుకోవడం సామాన్యులకు తలకు మించిన భారంగా మారేది.

ఈ ఇబ్బందులన్నింటినీ తొలగిస్తూ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ నిబంధనలను మార్చింది. ఈ కొత్త రూల్స్‌తో ఇకపై పల్లెల్లోని పాత ఇళ్లు, స్థలాల రిజిస్ట్రేషన్లు ఎలాంటి ఆలస్యం లేకుండా చకచకా జరిగిపోతాయి.
ఇకపై వారసత్వ ఆస్తుల రిజిస్ట్రేషన్‌కు యజమానులు ఇచ్చే సెల్ఫ్ డిక్లరేషనే ఫైనల్. ఆ ఆస్తి తమ పూర్వీకుల నుంచి వచ్చిందని, దానికి తామే పూర్తి హక్కుదారులమని రాతపూర్వకంగా రాసిస్తే చాలు.
ఈ కొత్త నిబంధనల వల్ల ఇక రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరిగే కష్టాలు తప్పుతాయి. నేరుగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లోనే రిజిస్ట్రేషన్ పనులు సులువుగా పూర్తి చేసుకోవచ్చు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో సామాన్య ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సెల్ఫ్ డిక్లరేషన్‌లో యజమానులు కొన్ని విషయాలను చాలా స్పష్టంగా చెప్పాల్సి ఉంటుంది. ఆ స్థలం లేదా ఆస్తి ప్రభుత్వ నిషేధిత జాబితా (సెక్షన్ 22A)లో లేదని, ఎలాంటి వివాదాల్లేని ఆ ఆస్తికి తామే పూర్తి హక్కుదారులమని అందులో రాయాలి.
అయితే, ఒకవేళ ఎవరైనా కావాలని తప్పుడు సమాచారం ఇచ్చినా లేదా నిజాలు దాచిపెట్టినా సరే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు (సివిల్, క్రిమినల్ కేసులు) తప్పవని గుర్తుంచుకోవాలి.











Leave a Reply