ఇండియాలో ఆపిల్ ఐఫోన్ 17e లాంచ్ అయింది. దీని ప్రారంభ ధర రూ.64,900. ఇందులో A19 చిప్, మాగ్‌సేఫ్, సిరామిక్ షీల్డ్ 2 లాంటి లేటెస్ట్ ఫీచర్లు ఉన్నాయి. 256GB, 512GB స్టోరేజ్ ఆప్షన్లలో వస్తున్న ఈ ఫోన్ సేల్స్ మార్చి 11 నుంచి మొదలవుతాయి.
భారత మార్కెట్లోకి కొత్త ఆపిల్ ఐఫోన్ 17e వచ్చేసింది. ఇందులో A19 చిప్, OLED డిస్ప్లే, మెరుగైన కెమెరా, వైర్లెస్ ఛార్జింగ్ లాంటి ఆకర్షణీయమైన ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్ 256GB, 512GB స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది. దీనికి సంబంధించిన ప్రీ-ఆర్డర్లు ఇప్పటికే మొదలయ్యాయి. మార్చి 11 నుంచి ఆపిల్ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు, ఎంపిక చేసిన స్టోర్లలో అమ్మకాలు ప్రారంభం కానున్నాయి.

ఆపిల్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐఫోన్ 17e ఇండియాలో లాంచ్ అయింది. ఐఫోన్ 17 సిరీస్‌లో తక్కువ ధరకు దొరికే మోడల్ ఇదే. ఈసారి ఇందులో కొత్త A19 చిప్, మాగ్‌సేఫ్ సపోర్ట్, సిరామిక్ షీల్డ్ 2 ప్రొటెక్షన్ లాంటి మంచి అప్‌గ్రేడ్స్ ఇచ్చారు.
అయితే, ఇందులో ఇంకా 60Hz OLED డిస్ప్లే, ఒకే బ్యాక్ కెమెరాను మాత్రమే ఇస్తున్నారు. కాకపోతే బేస్ మోడల్ 256GB స్టోరేజ్‌తో రావడం విశేషం. మరి ఈ కొత్త ఐఫోన్ 17e ధర, మిగతా ఫీచర్ల వివరాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
భారత్‌లో ఐఫోన్ 17e ధర, సేల్ వివరాలు:
ఇండియాలో ఐఫోన్ 17e బేస్ వేరియంట్ (256GB) ధరను రూ.64,900 గా నిర్ణయించారు. అలాగే 512GB మోడల్ రూ.84,900 కు లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ బ్లాక్, సాఫ్ట్ పింక్, వైట్ కలర్స్‌లో వస్తోంది. ప్రస్తుతం దీనికి ప్రీ-ఆర్డర్లు తీసుకుంటున్నారు. మార్చి 11వ తేదీ నుంచి ఆపిల్ అఫీషియల్ వెబ్‌సైట్‌తో పాటు అధీకృత స్టోర్లలో నేరుగా కొనుగోలు చేయవచ్చు.

ఐఫోన్ 17e స్పెసిఫికేషన్లు:
ఈ ఫోన్లో 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR OLED డిస్ప్లేను ఇచ్చారు. ఇది 60Hz రిఫ్రెష్ రేట్, ట్రూ టోన్‌తో పాటు 800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ను సపోర్ట్ చేస్తుంది. స్క్రీన్ రక్షణ కోసం లేటెస్ట్ సిరామిక్ షీల్డ్ 2 వాడారు. దీనివల్ల పాత మోడల్స్ కంటే 3 రెట్లు ఎక్కువ స్క్రాచ్ రెసిస్టెన్స్ ఉంటుంది. అలాగే, డిస్ప్లే పైన పాత నాచ్ డిజైన్‌ను అలాగే కంటిన్యూ చేశారు.
ఈ ఐఫోన్ 17e ఆపిల్ లేటెస్ట్ ‘A19’ చిప్‌తో పనిచేస్తుంది. ఇందులో 6-కోర్ CPU, 4-కోర్ GPU, 16-కోర్ న్యూరల్ ఇంజిన్ ఇచ్చారు. 8GB ర్యామ్ ఉండటం వల్ల మల్టీ టాస్కింగ్ చాలా స్మూత్‌గా అవుతుంది. ఇది లేటెస్ట్ iOS 26 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. ఆపిల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్లకు కూడా ఇది పూర్తి సపోర్ట్ ఇస్తుంది. ఇక నీళ్లు, దుమ్ము నుంచి ఫోన్ పాడవకుండా ఉండేందుకు దీనికి IP68 రేటింగ్ ఇచ్చారు.
కెమెరా, ఛార్జింగ్:
ఐఫోన్ 17e వెనుకవైపు 48MP సింగిల్ కెమెరాను ఇచ్చారు. ఇది OISతో పాటు 2x ఆప్టికల్ జూమ్‌ను సపోర్ట్ చేస్తుంది. సెల్ఫీల కోసం ముందువైపు 12MP ట్రూడెప్త్ కెమెరా ఉంటుంది. అయితే, ఇందులో యాక్షన్ మోడ్, సినిమాటిక్ వీడియో లాంటి ప్రీమియం ఫీచర్లు మాత్రం లేవు.

ఛార్జింగ్ విషయానికొస్తే, ఈ ఫోన్ 20W వైర్డ్ ఛార్జింగ్, 7.5W మ్యాగ్‌సేఫ్ వైర్లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.











Leave a Reply