తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత (Kavitha).. నార్సింగిలోని ఓ వెంచర్ వద్ద స్థానికులతో కలిసి ధర్నాకు దిగారు.
రియల్ ఎస్టేట్ వ్యాపారులు వేస్తున్న అక్రమ వెంచర్లు హైడ్రా (HYDRA) అధికారులకు కనిపించడం లేదా అని ఆమె ప్రశ్నించారు. అయితే, ఆందోళన చేస్తున్న కవితను పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, జాగృతి కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగి అక్కడ ఉద్రిక్తత నెలకొంది.
అక్రమ నిర్మాణాల పై చర్యలు తీసుకోవాలి అని ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులా సిగ్గు… సిగ్గు pic.twitter.com/9j55sru3pG
— Telangana Jagruthi (@TJagruthi) March 3, 2026
అంతకుముందు, మూసీ నది పక్కన నిర్మిస్తున్న ఓ అపార్ట్మెంట్ వెంచర్ వద్దే కవిత బైఠాయించారు. చీకటి పడినా వెనక్కి తగ్గకుండా.. సెల్ఫోన్ లైట్ల వెలుతురులోనే తన ఆందోళనను కొనసాగించారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్వయంగా ఇక్కడికి వచ్చే వరకు కదిలే ప్రసక్తే లేదని ఆమె తేల్చి చెప్పారు. పేదల ఇళ్లను కూలగొడుతున్న అధికారులు, మూసీని ఆనుకుని భారీ రియల్ ఎస్టేట్ వెంచర్లు వెలుస్తున్నా ఎందుకు వదిలేస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారి అరెస్ట్ ను నిరసిస్తూ నార్సింగి పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపిన
— Telangana Jagruthi (@TJagruthi) March 3, 2026
తెలంగాణ జాగృతి నాయకులు, కార్యకర్తలు pic.twitter.com/MBfhAMujlL
పోలీసులు బలప్రయోగంతో మమ్మల్ని అరెస్ట్ చేయడం అన్యాయం
— Telangana Jagruthi (@TJagruthi) March 3, 2026
మూసీ నది మధ్యలో పెద్దవాళ్లు కడుతున్న బిల్డింగులను వదిలిపెట్టి పేదవాళ్ల బిల్డింగులు కూలగొడుతున్నారు
బీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ నిర్మాణాలకు అనుమతి ఇచ్చింది.. దానినే కాంగ్రెస్ కొనసాగిస్తోంది.. పెద్దల పక్షాన్నే ప్రభుత్వాలు ఉన్నాయని… pic.twitter.com/aXSlPRJyLO











Leave a Reply