హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి ఏటీఎం క్యాష్ విత్‌డ్రాలపై కొత్త రూల్స్ అమలు చేయనుంది. హెచ్డీఎఫ్సీ ఏటీఎంలలో యూపీఐ విత్‌డ్రాలపై బ్యాంక్ కొత్త నిబంధన తెచ్చింది. ఇక నుంచి యూపీఐ ద్వారా తీసే నగదును కూడా కస్టమర్ల నెలవారీ ఉచిత ఏటీఎం లావాదేవీల కోటాలోనే లెక్కించనున్నారు.
2026 ఏప్రిల్ 1 నుంచి హెచ్డీఎఫ్సీ కొత్త నిబంధనలు. ఉచిత లిమిట్ దాటిన తర్వాత ఏటీఎంలో యూపీఐతో డబ్బులు తీస్తే సాధారణ ఏటీఎం ఛార్జీలు వర్తిస్తాయి.
ఏప్రిల్ 1 నుంచి హెచ్డీఎఫ్సీ ఏటీఎంలలో ఉచిత లావాదేవీల పరిమితి దాటాక యూపీఐ ద్వారా నగదు డ్రా చేస్తే ఛార్జీలు పడతాయి. సాధారణ ఏటీఎం విత్డ్రాల్స్ మాదిరిగానే, ఫ్రీ లిమిట్ దాటిన ప్రతి లావాదేవీపై రూ. 23తో పాటు వర్తించే పన్నులను (taxes) బ్యాంక్ వసూలు చేస్తుంది.
హెచ్డీఎఫ్సీ కస్టమర్లకు మెట్రో సిటీల్లో నెలకు 3, మిగతా చోట్ల 5 ఏటీఎం లావాదేవీలు ఉచితం. ఇకపై యూపీఐ ద్వారా ఏటీఎంలో తీసే నగదును కూడా ఈ ఫ్రీ కోటాలోనే లెక్కగడతారు. ఈ రెండూ కలిపి మీ లిమిట్ దాటితే మాత్రం ఛార్జీలు పడతాయి.
కాకపోతే, కొన్ని ఎంపిక చేసిన కరెంట్ అకౌంట్లకు మాత్రం ఏటీఎం లావాదేవీలపై ఎలాంటి లిమిట్ లేదు. ఈ కింది అకౌంట్లు ఉన్నవారు హెచ్డీఎఫ్సీ ఏటీఎంలలో ఎన్నిసార్లయినా ఉచితంగా నగదు విత్‌డ్రా చేసుకోవచ్చు:
- బిజ్ సిరీస్ (లైట్ ప్లస్, ప్రో ప్లస్, అల్ట్రా ప్లస్, ఎలైట్ ప్లస్)
- ఫ్లెక్సీ, ప్లస్, యాక్టివ్, అసెంట్, మ్యాక్స్, మ్యాక్స్ అడ్వాంటేజ్
- ప్రొఫెషనల్, ఈ-కామ్, అపెక్స్, అల్టిమా
- మర్చంట్ అడ్వాంటేజ్ (రెగ్యులర్ & ప్లస్), సుప్రీం, మరియు స్టార్టప్ కరెంట్ అకౌంట్లు.
ఇదిలా ఉంటే, సమాజానికి మేలు చేసే కొత్త ఆవిష్కరణలకు అండగా నిలిచేందుకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ముందుకొచ్చింది. ‘పరివర్తన్ స్టార్టప్ గ్రాంట్స్’ ద్వారా ఈ ఏడాది 20 కోట్ల రూపాయల సాయం అందించనున్నట్లు తెలిపింది. వ్యవసాయం, ఏఐ, పర్యావరణం, ఉపాధి కల్పన లాంటి 10 ముఖ్యమైన రంగాల్లో పనిచేసే స్టార్టప్‌లకు ఈ నిధులు ఇవ్వనున్నారు.











Leave a Reply