రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక పారిశ్రామికాభివృద్ధి బాగా పెరిగింది. ఇది చూసి ఓర్వలేని వైసీపీ నేతలు, పెట్టుబడులు రావడం లేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఎన్డీయే అధికారంలో ఉన్నంత వరకు రాష్ట్రానికి పరిశ్రమలు వస్తూనే ఉంటాయి.
వైసీపీ వాళ్లు ఐదేళ్లలో ఒక్క డీఎస్సీ వేయలేదు, కనీసం ఒక్క కానిస్టేబుల్ పోస్టు కూడా భర్తీ చేయలేదు. కానీ మన కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ 20 నెలల్లోనే ఏకంగా 6.28 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం. ఇచ్చిన మాట ప్రకారం ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు పక్కాగా ఇస్తాం, ఇందులో ఎలాంటి రాజీ లేదు అని అసెంబ్లీలో సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. వైసీపీ వాళ్లు రాష్ట్ర పరువు తీస్తే.. తాము మళ్లీ ఏపీ బ్రాండ్ ఇమేజ్‌ని పెంచి పెట్టుబడులు తెస్తున్నామన్నారు. తాను, పవన్, బీజేపీ ఒకే మాట మీద ఉండటం వల్లే ఇదంతా సాధ్యమవుతోందని ఆయన అన్నారు.
వైసీపీ తెచ్చిన నెగెటివ్ ఇమేజ్ను చెరిపేశాం!
- వైసీపీ పాలనలో 913 కంపెనీలు మూతపడ్డాయి. ఉపాధి లేక యువత వలసలు పోయారు, కొందరు మత్తుకు బానిసలయ్యారు.
- మా ప్రభుత్వం రాగానే పారిశ్రామిక రంగాన్ని గాడిలో పెట్టి, ఏకంగా 6.28 లక్షల ఉద్యోగాలు సృష్టించాం.
ఉద్యోగాల కల్పన వివరాలు:
- MSME: 2,48,906
- స్కిల్ డెవలప్మెంట్: 1,46,627
- పరిశ్రమలు: 95,174
- ఫుడ్ ప్రాసెసింగ్: 64,035
- డీఎస్సీ & కానిస్టేబుల్: 30,592
- నెడ్‌క్యాప్: 20,393
- ఐటీ & ఎలక్ట్రానిక్స్: 13,846
- పర్యాటక రంగం: 5,028
- మైన్స్ అండ్ జియాలజీ: 3,220 మొత్తం: 6,28,327 ఉద్యోగాలు
విశాఖలో 5 గిగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్లు తీసుకువస్తున్నాం. ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కోసం లోకేశ్ ఆధ్వర్యంలో ఒక మంత్రుల కమిటీ కూడా వేశాం. రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టడాన్ని మరింత సులభతరం చేస్తూ ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ విధానం అమలు చేస్తున్నాం. ఏకంగా 25 కొత్త పాలసీలు తెచ్చాం, ప్రతి నియోజకవర్గంలో పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేస్తున్నాం. పాత ప్రభుత్వం ఇండస్ట్రీస్‌కి ఇవ్వాల్సిన ఇన్సెంటివ్స్ అన్నీ ఆపేస్తే, మేం వచ్చాక వాటిని చాలా వరకు క్లియర్ చేశాం. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు సంబంధించిన రూ.270 కోట్ల బకాయిలు చెల్లించాం.
మొన్నటి విశాఖ భాగస్వామ్య సదస్సులో మనం ఏకంగా 613 అగ్రిమెంట్లు చేసుకున్నాం. వీటి ద్వారా ఏపీకి రూ.13.25 లక్షల కోట్ల భారీ పెట్టుబడులు.. 16 లక్షల కొత్త ఉద్యోగాలు! ఏపీని కచ్చితంగా నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్తాం. విశాఖలో 5 గిగావాట్ల డేటా సెంటర్లు రాబోతున్నాయి.. దాన్ని ఐటీ, జీసీసీ హబ్‌గా మారుస్తున్నాం. దేశంలోనే తొలి క్వాంటమ్ కంప్యూటర్ను మన అమరావతిలో పెట్టి, దాన్ని నాలెడ్జ్ సిటీగా డెవలప్ చేస్తాం. ఇక రాయలసీమను డిఫెన్స్, ఏరోస్పేస్, డ్రోన్స్, ఎలక్ట్రానిక్స్ హబ్‌గా మారుస్తాం. పరిశ్రమలు రావాలంటే కేవలం 99 పైసలకే స్థలం ఇవ్వాలన్న ప్రతిపాదన వచ్చినప్పుడు మొదట నేనూ కాస్త ఆలోచించాను.. కానీ పెట్టుబడుల కోసం ఆ నిర్ణయం తీసుకున్నాం.

మన రాష్ట్రానికి దిగ్గజ ఐటీ కంపెనీలను రప్పించడానికి, ఎకరం 99 పైసలకే ఇద్దామని ఎస్ఐపీబీ మీటింగ్‌లో ప్రతిపాదన వచ్చింది. అసలు ఇది వర్కవుట్ అవుతుందా అని ఒక రెండు నిమిషాలు ఆలోచించి, సరేనన్నాను. కానీ ఆ నిర్ణయం అద్భుతమైన ఫలితాలను ఇచ్చింది. ముందు విశాఖకు టీసీఎస్ వచ్చింది, ఆ వెంటనే మిగతా కంపెనీలన్నీ క్యూ కట్టాయి. కేవలం 20 నెలల వ్యవధిలో ఇన్ని కంపెనీలు రావడం నిజంగా చరిత్రే. దేశం మొత్తంలో వచ్చిన పెట్టుబడుల్లో 25.6 శాతం కేవలం మన ఏపీకే వచ్చాయంటే అదీ మన రాష్ట్ర సత్తా. రూ.69 వేల కోట్లతో, 26 వేల మందికి ఉపాధి కల్పించే ఆర్సెలార్ మిత్తల్ ఉక్కు పరిశ్రమ ఫేజ్-1కి ఈ నెల 23న, అలాగే విశాఖలో గూగుల్ డేటా సెంటర్‌కు వచ్చే నెలలో మనం శంకుస్థాపన చేయబోతున్నాం.
ఒకప్పుడు అంటే 2019కి ముందు విద్యారంగంలో మన రాష్ట్రం దేశంలోనే టాప్ టూ, త్రీ ప్లేస్‌లలో ఉండేది. కానీ వైసీపీ పాలనలో అది కాస్తా 20వ స్థానం కంటే కిందకు పడిపోయింది. అసలు ప్రపంచంలో ఎక్కడైనా సరే ప్రాథమిక విద్యను మాతృభాషలోనే చెబుతారు. కానీ గత ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం అంటూ అనవసరమైన గందరగోళం సృష్టించింది. ఇది మన తెలుగు రాష్ట్రం.. మన భాషను మనం నేర్చుకోకపోతే రేపు మన ఉనికినే కోల్పోతాం.











Leave a Reply